Publisher | Manjul Publishing House |
ISBN 10 | 9355432976 |
Book Format | Paperback |
Book Description | వేగంగా మారుతున్న ప్రపంచంలో బాగా ఆలోచించగలిగే నైపుణ్యం అనేది వరం. ఎప్పుడూ ఒక అభిప్రాయానికి, లేదా ఒక ఆలోచనకు కట్టుబడకూడదు, పునరాలోచించుకోవటానికి సిద్ధపడాలి అని ఈ పుస్తకం మనకు చెబుతుంది. చాలా మంది తమకు అసౌకర్యం కలిగించే ఆలోచనలు చేయటానికి భయపడతారు. తమ విశ్వాసాలను,అభిప్రాయాలతో ఏకీభవించని వాళ్లకు దూరంగా మసలుతారు. ఒక పనిని తమకు అలవాటయిన పద్ధతిలో యాంత్రికంగా చేసుకుపోతారు. కొత్తగా ప్రయత్నించటానికి సందేహిస్తారు. ఒక పనిని నేర్చుకునే అవకాశంగా కాకుండా, మన అహంకారానికి ముప్పుగా భావిస్తాం. దానితో నమ్మకాలు అనేవి పెళుసుగా తయారవుతాయి. కొత్తగా నేర్చుకోవటం ఆగిపోతుంది. నిరంతరం మన అభిప్రాయాలను సమర్థించుకోవటానికి.. ఓ మత ప్రభోధకునిలా, ఓ న్యాయవాదిగా, ఓ రాజకీయవేత్తగా అవతారమెత్తుతాం. శాస్త్రవేత్తలా వ్యవహరించటానికి మాత్రం ఇష్టపడం. తమకు లభించే కొత్త దత్తాంశాల ఆధారంగా శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను మార్చుకుంటారు. తాము పొరపాటు అవకాశం ఉందనే వారి స్వభావం.. పునరాలోచనకు వారిని సిద్ధం చేస్తుంది. మీరు కూడా మీ వృత్తివ్యాపారాల్లో విజయం సాధించదలుచుకుంటే పునరాలోచన అన్న కళలో రాణించాలి. ఆ విద్య అలవడటానికి ఈ పుస్తకం మీరు తప్పక చదవితీరవలసిందే |
Publication Date | 25 June 2023 |
ISBN 13 | 9789355432971 |
Author | Adam Grant |
Language | Telugu |
About the Author | ప్రొఫెసర్ ఆడం గ్రాంట్ మనస్తత్వవేత్త. ఇతరుల మనసులో విషయాలను తెలుసుకోగల నైపుణ్యం ఉన్న వ్యక్తి. ఒరిజనల్స్, గివ్ అండ్ టేక్ వంటి పుస్తకాల ద్వారా పాపులారిటీ సంపాదించారు. ఇప్పుడు ఈ పుస్తకంలో పునరాలోచనకు సంబంధించిన కొత్త ప్రతిపాదనలను చేశారు. పునరాలోచనవల్ల కలిగే ప్రయోజనాలను, ఒకే అభిప్రాయానికి లేదా నమ్మకానికి కట్టుబడి ఉండటం వల్ల వచ్చే ప్రమాదకర ఫలితాలను సులువుగా అర్థమయ్యేలా చెబుతారు. మన నమ్మకాలకు, ఆలోచనలకు సంబంధం లేదు. మనం ఆలోచించిన ప్రతిదాన్ని నమ్మవలసిన అవసరం లేదు అని ఆయన సిద్ధాంతీకరిస్తారు. తప్పుచేసినా కూడా అపరాధభావం లేకుండా ఎలా మసులుకోవచ్చనేది చెబుతారు. నాసా శాస్త్రవేత్తలు, ఫైర్ ఫైటర్లు, భవిష్యత్తును అంచనా వేయగల మేధావులు, అంతర్జాతీయ డిబేటింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనేవారు, జీవితకాల అభ్యాసకుల పాఠశాలల్లో పనిచేసేవాళ్లు.. ఇలా కొత్త వృత్తుల వారి అనుభవాలు వివరిస్తారు. యాంకీలు, రెడ్ సాక్స్ ల వైరాలు, ఒక నల్లజాతి సంగీతకారుడు జాతి విద్వేషాన్ని తరిమికొట్టటం వంటివి పునరాలోచనకు ఉన్న సామర్థ్యాన్ని పరిచయం చేస్తాయి. మనకు ఉపయోగపడని అభిప్రాయాలను వదులుకోవటానికి, మనకు తెలియనిది తెలుసుకుని వివేకవంతగా ముందడుగు వేయటానికి దోహదం చేస్తాయి. జీవితంలో సాహోసపేతంగా అడుగులు వేయటానికి పునరాలోచన అనేది ఆయుధంగా ఉపయోగపడుతుంది.. |
Number of Pages | 282 pages |